అనంతపురం అర్బన్: పేదలకు నోటీసులు ఇచ్చి రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ సిపిఎం నేతలు ఆర్డీవోను నిలదీత
Anantapur Urban, Anantapur | Apr 28, 2026
అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడును సిపిఎం నేతలు మంగళవారం సాయంత్రం నిలదీశారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి నోటీసులను అందించి రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్డీవోను నిలదీశారు. ప్రభుత్వ భూమి కబ్జా అయితే దాని గురించి పట్టించుకునే వారు లేరని వంక పోరంబోకు స్థలాలను యదేచ్ఛగా ఆక్రమించుకుంటున్న పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు మాత్రం నోటీసులు ఎలా ఇస్తారంటూ నిలదీశారు.