మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు తెలియజేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పథకాలకు అర్హులుగా మున్సిపల్ కార్మికులను గుర్తించకపోవడం తగదన్నారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు , పనికి తగ్గట్టు కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు.