అసిఫాబాద్: బీసీ రిజర్వేషన్లకు బీజేపీనే అడ్డు: సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్
బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు బీజేపీనే అసలు అడ్డు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ అన్నారు. శుక్రవారం ASF సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణాలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు బీజేపీనే అసలు అడ్డం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పేట్టి అన్నీ రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే దాన్ని ఆమోదించకుండా తొక్కిపెట్టిందన్నారు. పైగా రాష్ట్రంలో బీసీ బంద్ కు మద్దతు ఇస్తున్నది అన్నారు . బీసీ సంఘాల నేతలు బీజేపీ పై పోరాటం చేయాలనీ అన్నారు .