మర్రిగూడ: కొట్టాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల పరిధిలోని కొట్టాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కొట్టాల గ్రామంలో 54 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 11 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ పూర్తి కాగా, మొదటి దశ బిల్లులు మంజూరైనట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.