ఒంగోలు అర్బన్: క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసుల ప్రత్యేక నిఘా. ఉల్లంఘనలకు చట్టపరమైన చర్యలు తప్పవు: ఎస్పీ
Ongole Urban, Prakasam | Apr 12, 2026
ఐపియల్ క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ మరియు క్రికెట్ బెట్టింగ్‌లపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు మరియు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, తమ తమ పరిధిలోని హోటళ్లు, డార్మెంటరీ, టీ దుకాణాలు, బార్లు, హాస్టళ్లు, ఎల్ఈడి స్క్రీన్‌లు ఉన్న షాపులు మరియు ఇతర ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో గోప్యంగా నిర్వహించే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్,గేమ్స్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు.