బనగానపల్లె: పెట్నికోట గ్రామంలో రెండు గడ్డివాములు దగ్ధం
కొలిమిగుండ్ల మండలం పెట్నికోట సమీపంలో రెండు గడ్డివాములు దగ్ధమైన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి గడ్డివాముల సమీపంలో చెత్తను అంటిస్తుండగా, ప్రమాదవశాత్తు అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో రాంకో సిమెంట్, అల్ట్రాటెక్ పరిశ్రమ నుంచి సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. రెండు గడ్డి వాములు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు వాపోయారు.