చెన్నూరు: లంబడి తండాలోని మురుగు కాలువలో లభ్యమైన మగ శిశువు మృతదేహం
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భీమారం మండల కేంద్రంలోని లంబాడి తండాలో మురుగు కాల్వలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం కలకలం రేపొంది. దీంతో పంచాయతీ సెక్రటరీ దేవేందర్ స్థానికుల సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.