హుజూరాబాద్: పట్టణంలోని సూపర్ మార్కెట్ యజమాని సంతోష్ ఇంట్లో కారును స్టార్ట్ చేస్తుండగా ఇంజన్ లో చెలరేగిన మంటలను అర్పిన ఫైర్ సిబ్బంది
హుజరాబాద్: పట్టణంలో బుధవారం ఉదయం మల్లికార్జున సూపర్ మార్కెట్ యజమాని సంతోష్ తన ఇంట్లో పార్కు చేసి ఉన్న కార్ ను స్టార్ట్ చేసే సమయంలో పోగలు రావడాన్నీ గమనించి కిందికి దిగాడు వెంటనే మంటలు రావడం ప్రారంభం కావడంతో విషయాన్ని గుర్తించిన సంతోష్ మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతొ సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కారుతోపాటు లిఫ్ట్ ఫర్నిచర్ కాలిపోయాయని ఫైర్ ఆఫీసర్ తెలిపారు.