నంద్యాల అర్బన్: రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టారు: నంద్యాలలో వైసిపి అధ్యక్షుడు కాటసాని
Nandyal Urban, Nandyal | Apr 22, 2026
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకొని, రాయలసీమ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రులు నియోజకవర్గం ఇంచార్జిలు పాల్గొన్నారు