వేములపల్లి: శెట్టిపాలెంలోని ఎరుకలపూడిలో వన్యప్రాణుల మాంసాన్ని విక్రయిస్తున్న స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు
నల్గొండ జిల్లా, వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెం ఎరుకలపూడిలో వన్యప్రాణుల మాంసాన్ని విక్రయిస్తున్న స్థావరాలపై పోలీసులు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. కాగా పోలీసులు వస్తున్నారని సమాచారం తెలుసుకున్న మాంసం విక్రయదారులు అక్కడి నుండి పరారయ్యారు. వన్యప్రాణుల మాంసాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములపల్లి పోలీసులు తెలిపారు.