జహీరాబాద్: కొత్తూరు డి వద్ద రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు డి నారింజ ప్రాజెక్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం బీదర్ వైపు నుండి జహీరాబాద్ వైపు వస్తున్న బైకు ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో బోల్తా కొట్టగా ఆటోలో ప్రయాణిస్తున్న మొలకలపాడు గ్రామానికి చెందిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే అతన్ని జహీరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.