మాకవరపాలెం మండలంలోని APIIC ప్రభుత్వ భూములను పరిశీలించిన పరిశ్రమ శాఖ కార్యదర్శి యువరాజ్
మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామంలో ఉన్న APIIC ప్రభుత్వ భూములలో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నామని పరిశ్రమల శాఖ ప్రభుత్వ కార్యదర్శి యువరాజ్ తెలిపారు, మాకవరపాలెం మండలంలోని రాచపల్లి గ్రామంలో గల APIIC ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తో కలిసి పరిశ్రమ శాఖ కార్యదర్శి యువరాజ్ బుధవారం పరిశీలించారు, ఆయన వెంట జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.