కర్నూలు: వినోద వసతుల అభివృద్ధికి చర్యలు: నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
నగరంలోని ప్రజలకు మెరుగైన వినోద సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన జొహరపురం రోడ్డులోని ఇండోర్ స్టేడియం, టెన్నిస్ కోర్టు, సి & డి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, అక్కడే ఉన్న మున్సిపల్ పార్క్‌ను పరిశీలించారు.ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు ఇండోర్ స్టేడియం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం పూట వ్యాయామం, వినోదం కోసం వచ్చే ప్రజలు సౌకర్యంగా ఉపయోగించుకునేలా శుభ్రత పనులు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.అలాగే, నగరంలో పెరుగుతున్న నిర్మాణ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వ