కరీంనగర్: ఆరేపల్లి లోని ఓ కిరణా షాప్ లో ఉన్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలు తాడు ను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి
కరీంనగర్ నగరంలోని 20 వ డివిజన్ ఆరేపల్లి లో ఓ మహిళ మెడలో నుంచి ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి బంగారు పుస్తెల తాడు లాక్కెళ్ళినట్లు బాధితులు సోమవారం తెలిపారు. 20వ డివిజన్ ఆరేపల్లి లో కిరాణా షాపులో ఉన్న ఓ మహిళ వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి, ముఖానికి మాస్క్ పెట్టుకుని సామానుకొంటున్నట్లు నటించి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.