నంద్యాల అర్బన్: గాజుల పల్లెలో అత్యంత భక్తిశ్రద్ధలతో మౌలాలి స్వామి జాతుల వేడుకలు
Nandyal Urban, Nandyal | Jun 28, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో మౌలాలి స్వామి జార్తుల వేడుకలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. మొహరం ముగిసిన మూడు రోజుల తర్వాత ఈ వేడుకలను నిర్వహించడం ఆ గ్రామంలో ఆనవాయితీ. అధిక సంఖ్యలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు (ఫాతేహాలు) నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.