ఒంగోలు అర్బన్: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందడంపై హర్షం, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రజలు
Ongole Urban, Prakasam | Jun 29, 2026
ప్రకాశం జిల్లాలోని లక్ష్మీపురం, మాగుటూరు ప్రాంతాల ప్రజలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెలిగొండ ప్రాజెక్టు నిర్వహిస్తులకు అందించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నిర్వసితులకు పరిహారం అందించారని 20 ఏళ్ల కల నేడు ఫలించబోతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగేందుకు ప్రాజెక్టు పూర్తి కావడం ఎంతో అవసరమని తెలిపారు.