నాగిరెడ్డిపేట: ముంపునకు గురై నష్టపోయిన రైతులను ఎకరానికి రూ.50 వేలు ఇచ్చి ఆదుకోవాలని రోడ్డు ఎక్కిన రైతులు : మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర
ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడుపై ధర్నా రాసారోకో నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాలైన రైతులు తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా రాసారోకో నిర్వహించారు.రైతులకు మద్దతుగా ఎలారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరయ్యారు. పంటలు నీట మునిగి రైతులకు భారీగా నష్టం వాటిల్లితుందని అన్నారు.నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేలు పరిహారం అందించాలని అన్నారు.