సంగారెడ్డి: హత్నూర పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్
సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ను మంగళవారం జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతోపాటు రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు క్రైమ్ రికార్డులను ఆన్లైన్లో నమోదు చేయాలని వాహనాలను తనిఖీ చేయాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రికార్డ్స్ తప్పనిసరి అన్నారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఎస్పి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జిన్నారం సీఐ నయీముద్దీన్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.