కావలి: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డినీ కలిసిన APSRTC కావలి డిపో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీను...
ఏపీఎస్ ఆర్టీసీ కావలి డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన దేవరకొండ శ్రీను, సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిని తన యూనియన్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, కార్మికుల, సిబ్బంది సమస్యల పరిష్కారానికి యూనియన్ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది.