బనగానపల్లె: బనగానపల్లెలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
బనగానపల్లె నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 8 మందికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి తన సొంత నిధులతో ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందులో ఏడుగురికి నెలకు రూ.3 వేల చొప్పున, ఒకరికి రూ.2 వేల చొప్పున పెన్షన్ అందజేస్తున్నారు. కైపా గ్రామంలో ముగ్గురు, సంకలాపురంలో ఇద్దరు, చెరువుపల్లెలో ఇద్దరు, కొలిమిగుండ్లలో ఒకరు ఈ సహాయం పొందుతున్నారు.