ఒంగోలు అర్బన్: నీట్ పరీక్ష నిర్వహణ కు జిల్లాలో 1,821 విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాలు సిద్దం.
Ongole Urban, Prakasam | Jun 18, 2026
ప్రకాశం జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ స్థాయి నీట్ (NEET) పరీక్షను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్ష సక్రమ నిర్వహణపై గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలసి రెవెన్యూ, బ్యాంకు పోలీస్, పోస్టల్, విద్యా, వైద్య, అగ్నిమాపక, ప్రజా రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలను పగటిపందిగా నిర్వహించాలన్నారు