ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో శుక్రవారం భార్య భర్తల మృతదేహాలు ఉరివేసుకొని మృతి చెందినట్లుగా వెలుగులోకి వచ్చాయి. అటువైపు వెళ్లిన పశువుల కాపర్లు మృతదేహాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మృతులు ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఏమి జరిగింది అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.