ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని త్రవ్వ గుంట సమీపంలో పట్టపగలే చోరీ, చంద్రమౌళి అనే వ్యక్తికి చెందిన ఇంటిలో చోరీకి పాల్పడ్డ దొంగలు
Ongole Urban, Prakasam | May 31, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని త్రోవగుంటలో ఆదివారం పట్టపగలే చోరీ జరిగింది. చంద్రమౌళి అనే వ్యక్తి ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బీరువా పగలగొట్టి రూ.15 వేలు నగదు అపహరించి వెళ్లారు. ఉదయం చర్చికి వెళ్లిన చంద్రమౌళి ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగిందన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్ టీం ని రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్నారు.