బనగానపల్లె: ప్రజలకు మెరుగైన రహదారులే ప్రభుత్వ లక్ష్యం :బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె-కోవెలకుంట్ల రహదారిని 4 లైన్లుగా విస్తరించే పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన మంత్రి.. పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు