సిర్పూర్ టి: ఆరు గ్యారెంటీలు అమలు పరచకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారయ్య అన్నారు
బెజ్జూరు మండలం గబ్బాయి గ్రామంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారయ్య ఆధ్వర్యంలో బాకీ కార్డులను పంచుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సారయ్య ప్రజలకు సూచించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎంత బాకీ ఉందో కార్డుల ద్వారా ప్రజలకు తెలియజేశారు,