నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేటలో ఘనంగా దసరా వేడుకలు: జమ్మి కొట్టే కార్యక్రమం, రావణ దహనం
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గ్రామాల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ఆయుధ పూజలు చేసి, సంప్రదాయబద్ధంగా జమ్మి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో రావణ దహనం చేపట్టగా, దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.