కడప: ఉమ్మడి జిల్లా నుండి ఎంపికైన డీఎస్సీ అభ్యర్థులతో అమరావతికి పయనం
Kadapa, YSR | Sep 24, 2025 బుధవారం ఉమ్మడి జిల్లా నుండి ఎంపికైన డీఎస్సీ అభ్యర్థులు మొత్తం 869 కాగా అందులో 820 మంది వారి కుటుంబ సభ్యులతో కలసి 1666 మంది, 122 స్టాఫ్,15 మంది పోలీసుల భద్రతతో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం నుంచి ఉదయం 9:40 గం లకు 43 ఆర్టీసీ బస్సుల్లో అమరావతికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. 25-9-2025 గురువారం మధ్యాహ్నం 2-30 గంటలకు అమరావతి సెక్రటేరియట్ ప్రాంగణం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ల చేతులు మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు.