వాంకిడి: కలెక్టరేట్‌లో స్వాతంత్ర్య వేడుకల్లో ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, భక్తి గీతాలు, ఉపన్యాసాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు తెలంగాణ శాసనమండలి బండ ప్రకాష్, జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.