ఒంగోలు అర్బన్: ఒంగోలు నియోజకవర్గస్థాయి బడ్జెట్ అవుట్రిచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీలు
Ongole Urban, Prakasam | Apr 4, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండదండలుగా వెన్నుదన్నుగా నిలబడి పాలన సాగిస్తుందన్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీల లో భాగంగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను తూచా తప్పక అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం అత్యధికంగా నిధులు కేటాయింపు చేసిందన్నారు.