సంగారెడ్డి: న్యాయవాదులకు రక్షణ చట్టం వచ్చేవరకు ఉద్యమం చేస్తాం: బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి
న్యాయవాద రక్షణ చట్టం వచ్చేవరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కోర్టు ముందు బుధవారం 48 గంటల నిరాహార దీక్షలను బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వైద్యుల మాదిరిగా న్యాయవాదులకు కూడా రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.