నంద్యాల అర్బన్: నంద్యాలలో విషాదం, రైలు కిందపడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
Nandyal Urban, Nandyal | Apr 16, 2026
నంద్యాల పట్టణంలో గురువారం రైలు కింద పడి రైల్వే ఉద్యోగి జైపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. గత 25 సంవత్సరాలుగా రైల్వే డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ సెక్షన్ లో జైపాల్ ఉద్యోగం నిర్వహిస్తున్నాడు.అయితే గత తొమ్మిది సంవత్సరాల భార్యతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నాడు.ఇటీవలే భార్య ఇవ్వాల్సిన భరణం కేసులో జైపాల్ కోర్టు అరెస్టు ఇష్యూ చేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కూతుళ్లు తెలిపారు. ప్రస్తుతం జైపాల్ తన ఇద్దరు కూతుళ్ళతో రైల్వే కార్టర్స్ లో నివాసం ఉంటున్నాడు