ఒంగోలు అర్బన్: ఒంగోలులోని వైద్యశాఖ కార్యాలయం భవనం ప్రమాదకరంగా మారిన వైనం, సీలింగ్ పెచ్చులు ఊడిపోతుండడంతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు
Ongole Urban, Prakasam | Apr 29, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో సీలింగ్ ప్లాస్టర్ ఊడిపడడంతో భయాందోళన నెలకొంది. చాంబర్లో పైభాగం నుంచి సిమెంట్ పొరలు కూలిపోయాయి. దీంతో సిబ్బంది, ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల సీలింగ్ దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. నిత్యం వచ్చే ప్రజలు, ఉద్యోగులు పైకి చూస్తూ పనులు చేసుకుంటున్నారు. ఎప్పుడు ప్రమాదం జరిగుతుందోనని టెన్షన్గా ఉందని, అధికారులు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.