ఎల్లారెడ్డి: ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే ను విమర్శించడం తగదు – ఎల్లారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ నాయక్
ఎల్లారెడ్డి: ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న వారిని విమర్శించడం తగదని ఎల్లారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ నాయక్ అన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం, ప్రజా హితం కోసం ఆలోచించే ఎమ్మెల్యే మదన్మోహన్రావు పై ప్రతిపక్ష పార్టీలైన brs, bjp నాయకులకు తగదని అన్నారు. గడిచిన 20 ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గంలో సిసి రోడ్డు డ్రైనేజీలు బీటీ రోడ్డు వంటి కార్యక్రమాలను చేపడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే పై ఓర్వలేక తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలను మానుకొని అభివృద్ధికి సహకరించాలని సోమవారం అన్నారు.