డోన్: డోన్ లో పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన ఎస్పి, ఎమ్మెల్యే
Dhone, Nandyal | Jul 4, 2026 నంద్యాల జిల్లా డోన్ ప్రజల భద్రత కోసం అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఎస్పీ సునీల్ షోరాణ్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు . పట్టణంలో 118 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలూ నిఘా పెడతామని చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ముందుగా డీఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇస్తే.. వారి ఇళ్లను పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి భద్రత కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు