ఒంగోలు అర్బన్: ప్రభుత్వం చేతకానితనం వల్లే పొగాకు మార్కెట్ డౌన్ అయింది: వైసిపి ఇన్చార్జ్ చుండూరి రవి బాబు
Ongole Urban, Prakasam | Apr 22, 2026
ప్రభుత్వం చేతగానితనం వల్లే పొగాకు మార్కెట్ డౌన్ అయిందని వైసిపి ఒంగోలు నియోజక వర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. పొగాకు రైతులు ఎవరు అధైర్యపడవద్దని తొందరపడి తక్కువ రేట్లకు అమ్ముకొని నష్టపోవద్దని హితవు పలికారు. పొగాకు రైతులకు అండగా తమ పార్టీ తాము ఉంటామని సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. సిగరెట్లు మీద టాక్స్ పెరిగిందని పొగాకు రేట్లు తగ్గించటం మార్కెట్ని డౌన్ చేయటం సరికాదన్నారు. గత సంవత్సరంలో కూడా మొదట మార్కెట్ను డౌన్ చేసి కొనుగోలు చేశారని చివర్లో రేటు పెంచడం జరిగిందని గుర్తు చేశారు.