కావలి: ఉప్పలపాడు వద్ద వ్యక్తి మృతి
దగదర్తి (M) ఉప్పలపాడు వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర్లు (45) ఇంటి నుంచి బహిర్భూమికి బయటికి వెళ్లగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.