ఆళ్లగడ్డ: సిరివెళ్ల మోడల్ స్కూలు వద్ద క్షుద్ర పూజల కలకలం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల లోని మోడల్ స్కూల్ ప్రధాన గేటు వద్ద శనివారం అనుమానస్పద పూజ సామాగ్రి కనిపించడం కలకలం రేపింది, నిమ్మకాయలు కుంకుమ తదితర వస్తువులు ఉండడంతో క్షుద్ర పూజలు చేశారంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందారు, విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపల్ ఇస్రాత్త్ బేగం వెంటనే స్పందించి ఆ వస్తువులను తొలగించారు, మూఢనమ్మకాలను నమ్మొద్దని శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని విద్యార్థులు తల్లిదండ్రులకు సూచించారు