భూమా మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ఆమె భర్త సినీ హీరో మనోజ్ ప్రకటన, నంద్యాల జిల్లాలో తీవ్ర చర్చ
Nandyal Urban, Nandyal | May 20, 2026
భూమా ఫ్యామిలీ నుంచి మరో వారసురాలి పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. భూమా మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె భర్త, సినీ నటుడు మంచు మనోజ్ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం మౌనిక సోదరి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో సోదరి గెలుపు కోసం మౌనిక ప్రచారం చేశారు. తాజా ప్రకటనతో భూమా మౌనిక ఏ పార్టీ తరఫున, ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే ఆసక్తికర చర్చ నంద్యాల జిల్లాలో మొదలైంది కామెంట్..