మహేశ్వరం నియోజకవర్గం సరస్వతిగూడలో నెలకొన్న భూ సమస్యలు తీర్చాలని మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని గ్రామస్థులు కోరారు. తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయనను కలిసి భూములపై ఉన్న వివాదాలను వివరించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ అధికారులతో రీ సర్వే చేయించి ఇరువర్గాలకు న్యాయం చేస్తానని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు.