డోన్: బేతంచర్ల మండలంలో 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు
Dhone, Nandyal | May 17, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామంలోని పాణ్యం సిమెంట్స్ ఉన్నత పాఠశాలలో 2000-21 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి కలయిక అపూర్వమని ఉపాధ్యాయులు అభివర్ణించారు. అప్పటి ఉపాధ్యా యులను పూర్వ విద్యార్థులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు చిన్నినాటి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు.