అలంపూర్: గద్వాలలో మహిళా సమైక్య భవనం ప్రారంభం, 9 లక్షల చెక్కు అందజేత
గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం అమరవాయిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించారు. నేతోనిపల్లిలో కొత్త భవనాలకు భూమి పూజ చేసి, మహిళలకు 9 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.