నంద్యాల అర్బన్: నీకు జిల ఉంటే నువ్వు జైలుకు వెళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై విరుచుకుపడ్డ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | May 15, 2026
వైసిపి నాయకులు గురువారం కర్నూల్ లో నిర్వహించిన ధర్నాపై నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు మహిళలను వేధింపులకు గురి చేసే వారికి సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై సెటైర్లు వేశారు. నీకు జిల ఉంటే నువ్వు వెళ్ళు జైలుకు అని ఎవరైనా తాము ఇంజనీరింగ్ చేశాము లేదా పలానా చదువు చదివామని గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళు మాత్రం జైలుకు పోయి వచ్చిన విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు