ఒంగోలు అర్బన్: పిల్లి అశోక్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ విలపించిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు
Ongole Urban, Prakasam | Jun 22, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర్ కార్పొరేషన్ పరిధిలోని మంగమూరులో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిలను కఠినంగా శిక్షించాలి అంటూ మృతుని కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నారు పిల్లీ అశోక్ అనే యువకుడ్ని అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణంగా పొడిచి చంపారు ఇంట్లో ఉన్నటువంటి అశోక్ను అతని స్నేహితుడు మధు బయటకు తీసుకుపోయిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రిమ్స్ వైద్యశాలకు తరలించారు అక్కడికి వచ్చినటువంటి భార్య తల్లి ఇతర కుటుంబ సభ్యులు మృతికి కారణమైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను వేడుకున్నారు