బనగానపల్లె: జన గణనలో వివరాల సేకరణ పక్కాగా ఉండాలి: సంజామల తాసిల్దార్ చంద్రశేఖర్
నంద్యాల జిల్లా సంజామల ఎంపీడీవో కార్యాలయంలో జనగణన కార్యక్రమంపై మూడు రోజుల శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. తహశీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు అవగాహన కల్పించారు. ట్రైనర్లు శ్రీనివాసులు, రాజశేఖర్ ఇంటింటి వివరాల సేకరణ, గృహాల లెక్కింపు, నమోదు ప్రక్రియపై వివరించారు. సమాచార సేకరణలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా పూరి చేయాలని అధికారులు ఆదేశించారు