జన్నారం: మంచిర్యాల జిల్లాలో పేకాట స్థావరంపై దాడి: 8 మంది అరెస్ట్
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో పేకాట ఆడుతున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.42,040 నగదు, 8 ఫోన్లు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జన్నారం పోలీసులకు అప్పగించారు.