కర్నూలు జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు.డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జరిమానాలతో పాటు కొద్ది రోజుల జైలుశిక్ష మాత్రమే విధించేవారని, ఇకముందు మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.గత పది నెలల్లో (2025 జనవరి నుండి అక్టోబర్ 31 వరకు) మొత్తం 7,488 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చ