ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో అధికారుల ఆధ్వర్యంలో జరిగిన 5కె రన్ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
Ongole Urban, Prakasam | Apr 26, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదివారం ప్రారంభించారు. స్వీయ గణన కార్యక్రమానికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. ఈనెల 30వ తేదీలకు ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైట్లో తమ వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ వివరాలను పొందుపరచాలని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వం పేదలకు ఆర్థిక వనరులను సమకూర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.