పింఛా ప్రాజెక్టు పర్యవేక్షించిన రాయచోటి రూలర్ సీఐ వరప్రసాద్
.సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టును రాయచోటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వరప్రసాద్ గారు పర్యవేక్షించారు. ప్రాజెక్టు పరిస్థితులు, ఇన్‌ఫ్లో–అవుట్‌ఫ్లో వివరాలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు.ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సీఐ వరప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు వద్దకు విచ్చేసిన సందర్శకులకు భద్రతా సూచనలు, సలహాలు అందించారు.ప్రాజెక్టు వద్ద 24 గంటలపాటు పోలీసు పహారా ఉండటంతో, ప్రాజెక్టు పనులు సజావుగా కొనసాగుతున్నాయని పింఛా ప్రాజెక్టు ఎఈఈ బి.నాగేంద్ర నాయక్ తెలిపారు.