కోడుమూరు: కొత్తూరు వద్ద ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
కోడుమూరు మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మాదన్న అనే వ్యక్తి తన భార్య, మనుమడితో కలిసి స్కూటర్ పై పెద్దపాడుకు వెళ్తుండగా రోడ్డు మధ్యలో ఆపిన లారీని వాహనాల వెలుతురులో గుర్తించలేక ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన మాదన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.