ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మండలంలో మోస్తారు వర్షం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మోస్తారు వర్షం కురిసింది, ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి, చింతకుంట, ఓబులంపల్లె, పడకండ్ల, నాగిరెడ్డిపల్లె, పాల సాగరం ఎస్ లింగం దిన్నె గ్రామాల్లో వర్షం కురిసింది, కొద్ది రోజులుగా వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది